ఇంటర్నెట్‌ నిలిపివేతకు ప్రొటోకాల్‌ ఉందా: సుప్రీం

10 Sep, 2022 06:31 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడానికి ఏదైనా ప్రొటోకాల్‌ ఉందా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరుణాచల్‌ ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్‌లో తరచుగా ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ సాఫ్ట్‌వేర్‌ లా సెంటర్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖకు నోటీసు జారీ చేసింది. సాఫ్ట్‌వేర్‌ లా సెంటర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది. ప్రొటోకాల్‌ ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని పేర్కొంది. నాలుగు రాష్ట్రాలకు నోటీసు ఇవ్వడం లేదని తెలిపింది.

మరిన్ని వార్తలు