కరోనా విలయం; కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్‌

22 Apr, 2021 13:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నాలుగు అంశాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మనం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్న ప్రధాన న్యామయూర్తి బాబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం.. రేపటిలోగా కరోనాకు సంబంధించిన జాతీయ విధానం రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సినేషన్‌ వంటి కరోనా అత్యవసరాల సరాఫరాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కరోనా కట్టడికి సంసిద్ధత ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రాలకు మినీ లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం ఇవ్వాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ విధించే హక్కు రాష్ట్రాలకే ఉండాలని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాని కోర్టు పేర్కొంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి: ఎఫైర్‌; భర్తను జైలుకి పంపాలని స్కెచ్‌.. ట్విస్ట్‌ ఏంటంటే!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు