ఆర్టీసీ సిబ్బంది విభజనలో ‘సుప్రీం’ స్టే

6 Oct, 2020 08:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ కార్మికుల విభజన వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగులు, టీఎస్‌ఆర్టీసీకి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ స్థానికత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు తెలంగాణలో విధుల్లో చేరి బదిలీ, డిప్యుటేషన్లపై స్వస్థలమైన ఆంధ్రాలో విధులు నిర్వర్తించారు.

రాష్ట్ర విభజన అనంతరం వీరి అసలు పోస్టింగ్‌ అయిన తెలంగాణకు వెళ్లిపోవాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రా స్థానికత కలిగిన తమను తెలంగాణకు పంపడం అన్యాయమని ఆర్టీసీ సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు