శరద్‌ పవార్‌ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో

3 May, 2023 11:49 IST|Sakshi

సాక్షి, ముంబై: రాజకీయ కురువృద్ధుడు, విపక్షాల ముఖ్యనేత  శరద్‌ పవార్‌ తన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శరద్‌ పవార్‌ చేసిన షాకింగ్‌ ప్రకటనపై పలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకించడమే గాక ఆయనను కొనసాగించమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పారు. ఆయన ఇలా ప్రకటించగానే ఎన్సీపీ క్యాడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు, రాజకీయ నాయకులు నిరసనలు చేశారు.

కానీ ఆయన రాజీనామా చేసేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన కూతురు సుప్రియా సూలేకు ఒక వ్యక్తి నుంచి తన తండ్రి విషయమై ఆశ్చర్యకరమైన రీతిలో ఆభ్యర్థన వచ్చింది. ఈ మేరకు మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన సుప్రియాను కలిసిన పారిశుధ్య కార్మికుడు ఆయన(శరద్‌ పవార్‌) తన నిర్ణయాన్ని పునరాలోచించమంటూ అభ్యర్థించాడు. ఈ సంభాషణను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత సుప్రియా అతడితో సెల్ఫీని తీసుకుని, నగరంలోని రోడ్లను శుభ్రంగా ఉంచినందుకు ధన్యవాదాలని అతనికి చెప్పారు.

ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ..కేవలం 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనాలు జరిగాయన్న ప్రకాశ్‌ అంబేద్కర్‌ వ్యాఖ్యపై స్పందించారు. ఔను ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి అని ఎన్సీపీ సీనియర్‌ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. మాజీ ఉపముఖ్య మంత్రి అజిత్‌ పవర్‌ బీజేపీతో కలిసి వేడెక్కిస్తున్న రాజకీయాలకు చెక్‌ పెట్టేలా శరద్‌ పవర్‌ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. కాగా, కేంద్ర రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన శరద్‌ పవార్‌ దేశంలోని అ‍గ్ర ప్రతిపక్ష నాయకులలో ఆయన ఒకరు. పైగా మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ వంటి పార్టీలనే ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

(చదవండి: ఎన్సీపీ చీఫ్‌ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..)
 

మరిన్ని వార్తలు