ట్వీట్‌ చేస్తే వెయ్యి రూపాయలు వసూలు చేయాలి

6 May, 2022 14:51 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 

పశ్చాత్తాపపు బేరం
2014లో వాట్సాప్‌కు నేను చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా ఉన్నాను. ఫేస్‌బుక్‌కు దాన్ని 22 బిలియన్‌ డాలర్లకు అమ్మే బేరం కుదర్చ డంలో సాయపడ్డాను. ఇవ్వాళ, దానికి పశ్చాత్తాప పడుతున్నాను. ఫేస్‌బుక్‌ అనేది మున్ముందు ఫ్రాంకెన్‌ స్టెయిన్‌ రాకాసిలా మారి యూజర్ల డాటాను మింగి, మురికి సొమ్మును ఉమ్మివేస్తుందని ఎవరికీ తెలియదు! మాకూ తెలియలేదు.
– నీరజ్‌ అరోరా, వ్యాపారవేత్త

ప్రేరణకు ఖర్చవుతుంది
ట్విట్టర్‌ను లాభసాటి చేయడానికి ఎలాన్‌ మస్క్‌కు ఒక ఐడియా. గూగుల్‌లోంచి తీసుకుని ప్రేరణ కలిగించే కొటేషన్లను ట్వీట్‌ చేస్తే వంద రూపాయలు, ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి తీసుకున్న వీడియోను ట్వీట్‌ చేస్తే వెయ్యి రూపాయలు ఐఏఎస్‌ అధికారుల నుంచి వసూలు చేయాలి. 
 – అభిషేక్‌ ద్వివేది, న్యాయవాది

ఒప్పందం చేసుకుందాం
యూఎస్‌లోని కొన్ని హిందూ రైట్‌ వింగ్‌ సంస్థలు వారి ప్రయోజనాలకు నన్ను ఒక సంభావ్య ప్రమాదంగా చూపిస్తూ హిందూ జాతీయవాదుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయట. ఆ సంస్థలకు నా విన్నపం ఏమిటంటే, నా పేరునైనా వాడటం మానండి, లేదా అందులో నాకు 15 శాతం రాయల్టీ అయినా చెల్లించండి.
– రఖీబ్‌ హమీద్‌ నాయక్, జర్నలిస్ట్‌

ఎవరు బాధ్యులు?
ఇవ్వాళ స్టాక్‌ మార్కెట్లో రక్తపాతం సంభవించింది. ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంత ఎక్కువ. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎన్నడూ లేనంత ఎక్కువ. నిరు ద్యోగం ఎన్నడూ లేనంత ఎక్కువ. కోటీశ్వరుల సంఖ్య ఎన్నడూ లేనంత ఎక్కువ. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఎన్నడూ లేనంత ఎక్కువ. ఢిల్లీలో ఉష్ణోగ్రత ఎన్నడూ లేనంత ఎక్కువ. మనం నెహ్రూను నిందించగలమా? 
– ప్రవేశ్‌ జైన్, పారిశ్రామికవేత్త

పెరిగిన స్థాయి
ప్రధానమంత్రి మోదీ యూరప్‌ పర్యటనను దగ్గరగా చూస్తున్నాను. గత మూడు దశాబ్దాల్లో ఏ భారత ప్రధాని పట్ల కూడా ప్రపంచ నాయకులు ఇంత ఎక్కువ స్పందన కనబరచలేదు. భారత సంతతి వారు కూడా చాలా సంతోషపడ్డారు. రాజకీయాలను పక్కనపెట్టి మోదీ దేశ స్థాయిని అమాంతంగా పెంచారని అంగీకరిద్దాం.
– హేమంత్‌ బాత్రా, టీవీ హోస్ట్‌

ఎందులో ఎక్కువ?
ఎందుకు ఈ ‘ప్యూర్‌ వెజిటేరియన్లు’ ఎప్పుడూ మాంసాహారుల కన్నా తాము  అధికులమని చూపుకొంటారు? కులం ఉంది సుమా!                             
– మినీ నాయర్, రచయిత్రి

ప్రేమతో కృతజ్ఞతలు
మనం రెండు కోట్ల మందికి చేరామంటే నమ్మలేకపోతున్నా(ట్విట్టర్‌లో ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లయింది). మీ అందరూ నా మీద కురిపిస్తున్న ప్రేమకు ఎంతో పొంగిపోతున్నా. స్థిరంగా నాకు మద్దతిస్తున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. బోల్డంత ప్రేమ!
– సురేశ్‌ రైనా, క్రికెటర్‌ 

మరిన్ని వార్తలు