పిల్లలు మొబైల్‌ వదలడం లేదు..! 

13 Aug, 2020 08:55 IST|Sakshi

రెట్టింపైన మొబైల్, ల్యాప్‌టాప్‌ల వాడకం

తల్లిదండ్రుల ఆందోళన.. జాగ్రత్తలు మాత్రం శూన్యం

‘ఓఎల్‌ఎక్స్‌ ఇండియా’ సర్వేలో వెల్లడి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 వైరస్‌ నేపథ్యంలో తప్పనిసరైన ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లలు ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లకు మరింతగా అతుక్కుపోతున్నారు. వీరు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లతోనే గడిపే సమయం రెట్టింపుకావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని 5 – 15 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులతో ‘ఓఎల్‌ఎక్స్‌ ఇండియా’ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. (ఆటలను మింగేసిన కరోనా..)

ఆ సర్వేలోని ప్రధాన అంశాలు.. 
► తమ పిల్లలు విపరీతంగా ల్యాప్‌టాప్, మొబైల్‌లకు అతుక్కుపోతున్నారని 84 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.  
రోజుకు కనీసం 5 గంటలసేపు తమ పిల్లలు ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లతో ఉంటున్నారని 54 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. 
పిల్లలకు అనవసరమైన, విద్యా సంబంధంకాని విషయాలు, అందుబాటులోకి వస్తున్నాయని 57 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తమకు తెలియకుండానే ఆ సమాచారానికి ఆకర్షితులైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
అయినప్పటికీ, 57 శాతం మంది తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తమ పిల్లలకు ఎలాంటి అనవసరమైన, ప్రమాదకరమైన విషయాలు అందుబాటులో ఉండకుండా చేసేందుకు ఉన్న ఆప్షన్లను వాడుకోవడం లేదు.  
టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో 50 శాతం మంది తమ పిల్లల ఆన్‌లైన్‌ చదువులు, బ్రౌజింగ్‌ మీద ఎలాంటి నియంత్రణ చూపడం లేదు.  
ప్రమాదకరమైన సైట్లు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు పాటించడం లేదు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల్లో 50 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

(లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా