ఎలా డీల్‌ చేస్తున్నారు: ఓకే.. నాట్‌ ఓకే..!

5 May, 2021 14:29 IST|Sakshi

కరోనా నియంత్రణలో దేశాధినేతల నిర్ణయంపై ప్రజల మనోగతమిదీ.. 

వివిధ దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదా థర్డ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. అయితే, ఆయా దేశాల్లో కరోనా ఎంత వేగంగా పెరుగుతోందో.. అంతే వేగంగా  దేశాధినేతల నిర్ణయాల పట్ల ప్రజల్లో ఆమోదయోగ్యత స్థాయి కూడా తగ్గిపోతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే అంతర్జాతీయ డాటా ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ ఈ సర్వేను నిర్వహించింది. దీని ప్రకారం కరోనా నియంత్రణకు తమతమ అధ్యక్షులు లేదా ప్రధానులు తీసుకుంటున్న నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయని అనుకుంటున్న ప్రజల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందట. 

వివిధ అధినేతల నిర్ణయాల పట్ల ప్రజల్లో ఆమోదయోగ్యత స్థాయిపై జనవరి 27న తొలి సర్వేను నిర్వహించిన ఈ సంస్థ ఏప్రిల్‌ 27న మలి సర్వేను చేపట్టింది. మన దేశం విషయానికొస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల పట్ల  సంతృప్తి చెందినవారి శాతంలో 20% కోత పడినా.. మిగతా దేశాధినేతలతో  పోలిస్తే ఆయన మెరుగైన స్థాయిలోనే ఉన్నారని సదరు సర్వే తెలిపింది. అలాగే తొలి సర్వే సమయంలో పూర్తిగా నెగెటివ్‌ స్థానంలో ఉన్న పలు  దేశాధినేతలు (బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌) కరోనా నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యలతో ఇప్పుడు మెరుగైన స్థానానికి వచ్చారని పేర్కొంది. ఈ సర్వేలో వివిధ దేశాల అధినేతల పరిస్థితి ఏమిటో ఓసారి చూద్దామా.. – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు