కరోనా ఎఫెక్ట్‌తో స్వయం ఉపాధిలోకి.. 

19 Oct, 2020 11:10 IST|Sakshi

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాది కోల్పోయి రోడ్డుపై పడ్డవారు కోకొల్లలు. సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు అన్ని వర్గాల వారు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అంతేకాదు.. ఢిల్లీ, జీబీ రోడ్డులోని చాలామంది సెక్స్‌ వర్కర్ల జీవితంలోనూ కరోనా పెను మార్పులు తీసుకువచ్చింది. నరక కూపంనుంచి బయటపడదామని అనుకుంటూ.. పూట గడవదన్న భయంతో ఏటూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారికి మార్గాన్ని సుగమం చేసింది. కరోనా కారణంగా వేశ్యా వృత్తి తీవ్రంగా నష్టపోయింది. దీంతో వారు వేరే ఉపాది వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలో ‘హునర్‌ జ్యోతి’ కార్యక్రమం వారికి అండగా నిలిచింది. మట్టి దీపాలకు రంగులు వేయటం, కాగితపు బ్యాగులు తయారు చేయటం, అగరుబత్తీలు, కీ రింగుల తయారీ, ఫ్యాబ్రిక్‌ పనుల్లో శిక్షణననిచ్చి ఉపాధి కల్పిస్తోంది. ( ఆ ప్రాంతం‌లో భూకంపాల ముప్పు అధికం )

జీబీ రోడ్డులో పడుపు వృత్తి కొనసాగిస్తున్న 2000 మంది వేశ్యల్లో దాదాపు 20 శాతం మంది లాక్‌డౌన్‌ సమయంలో ఈ వృత్తుల వల్ల ఉపాధి పొందుతున్నారు. మరి కొంతమంది నగరాన్ని విడిచి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీనిపై ఓ వేశ్య మాట్లాడుతూ.. ‘‘ నేను 12 ఏళ్లుగా ఈ వృత్తినుంచి బయటపడదామని అనుకుంటున్నాను. కానీ, కుదర్లేదు. నా కూతురి భవిష్యత్తు కోసం ఏదైనా వేరే పని వెతుక్కోవాలనుకున్నా. ‘హునర్‌ జ్యోతి’ కార్యక్రమం ద్వారా మంచి అవకాశం లభించింది’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు