Navjot Singh Sidhu: కాంగ్రెస్‌ నేత సిద్ధూకు షాక్‌.. తప్పదు లొంగిపోవాల్సిందే!

20 May, 2022 13:56 IST|Sakshi

పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని కోరుతూ సిద్ధూ శుక‍్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ పిటిషన్‌ను అ‍త్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడం కుదరదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో సిద్ధూ నేడో రేపో సిద్ధూ లొంగిపోవాల్సి ఉంటుంది. 

ఇక, 1988 నాటి కేసులో కోర్టు నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు. ఇంతలోనే శుక‍్రవారం సిద్ధూ.. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని కోర్టును ఆశ్రయించారు. 

ఇది కూడా చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు