నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేయనున్న సువేందు అధికారి

8 Mar, 2021 15:50 IST|Sakshi

కోల్‌క‌తా: తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సిద్ధమ‌వుతున్నారు. ఆయ‌న ఈ నెల 12న నందిగ్రామ్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నట్లు ప్రకటించారు. గతంలో దీదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సువేందు.. మారిన సమీకరణల కారణంగా బీజేపీ తీర్ధం పుచ్చుకొని, ఏకంగా ఆమెపైనే పోటీకి సిద్ధం కావడంతో అందరి కళ్లు ఈ స్థానంపైనే పడ్డాయి. దీదీ ప్రతిసారీ పోటీ చేసే భ‌వానీపూర్‌ను కాద‌ని నందిగ్రామ్ నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్నట్లు ప్రకటించిన వెంటనే, బీజేపీ వేగంగా పావులు కదిపి ఆమెకు సరితూగే బలమైన అభ్యర్ధిని బరిలో దించింది. దీంతో పోరాటాల పురిటిగడ్డ అయిన నందిగ్రామ్‌ మరోసారి వార్తల్లోకెక్కింది.

మరిన్ని వార్తలు