ఆ పరిస్థితులు మారాయి: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

13 Aug, 2020 11:56 IST|Sakshi

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ అంటే అర్థం పూర్తిగా విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ బుధవారం అన్నారు. ‘మేం మాకు కావాల్సినవి పరిస్థితులకు తగినట్టుగా కొంటాం’ అని తెలిపారు. ఒక వర్చవల్‌ బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడతాం. స్వదేశీ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదు. మంచి విషయాలు ప్రపంచలో ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో లభించే వస్తువులను ఉపయోగిస్తాం. స్వదేశీ అర్థం దేశీయ ఉత్పత్తులను ప్రోతహించడం. విదేశీ పెట్టుబడులపై పరిమితులను విధించడం. స్వయం ఆధారిత దేశాలు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవాలి. ప్రపంచం అంటే ఒకే కుటుంబంలా ఉండాలి కానీ ఒకే మార్కెట్‌లా కాదు. స్వాతంత్రం వచ్చిన తరువాత మనం విదేశీ ఉత్పత్తులపై చాలా రోజులు ఆధారపడ్డాం. స్వదేశీ వస్తువులను, టెక్నాలజీని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి’ అని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ లభ్యం కానీ టెక్నాలజీలను, వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోవాలి అని కోరారు.

చదవండి: ప్రణబ్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు