స్వప్నలోక్‌ ప్రమాదం బాధించింది: ప్రధాని మోదీ ఎక్స్‌ గ్రేషియా ప్రకటన

17 Mar, 2023 20:55 IST|Sakshi

న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు పోవడం​ తనను ఎంతో బాధించిందన్న ఆయన..  బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.  

ఇక స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి బాధిత కుటుంబాలకు ఆ సాయం అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వాళ్లకు రూ.50వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. 

మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ ఘోరం జరిగింది. సంబల్‌లోని చందౌసి ప్రాంతంలో బంగాళాదుంప కోల్డ్‌ స్టోరేజ్‌ కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నుంచి మరో పదకొండు మందిని రక్షించారు. ఈ ఘటనపైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ సాయం ప్రకటించారు.

మరిన్ని వార్తలు