తిరుపతి బాలాజీ స్టైల్‌లో 18 అడుగుల ‘స్వర్ణ గణేషుడు’.. వినాయక చవితికి సిద్ధం

25 Aug, 2022 13:11 IST|Sakshi

లక్నో: వినాయక చవితి పండగ కోసం యావత్‌ దేశం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31న గణేష్‌ చతుర్థి వచ్చింది. పండగ దగ్గరపడుతున్న క్రమంలో గణేషుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు అన్ని ఏర్పాట‍్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశుడు. అయితే, ఈసారి ‘స్వర్ణ గణేష్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. బంగారంతో సిద్ధం చేస్తున్న 18 అడుగుల వినాయకుడి విగ్రహం వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌసి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు ఈ స్వర్ణ గణేషుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నట్లు చెప్పారు అజయ్‌ ఆర్యా అనే నిర్వాహకుడు. ‘గణేషుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతి బాలాజీ మాదిరిగా బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నాం.’ అని తెలిపారు. బంగారు గణేషుడి విగ్రహం వినాయక చవితి నాటికి పూర్తవుతుందని చెప్పారు అజయ్‌.

ఇదీ చదవండి: ఆవు పేడతో వినాయక విగ్రహాలు 

  

మరిన్ని వార్తలు