స్విగ్గీలో ఐస్‌క్రీం, చిప్స్‌ ఆర్డర్‌ చేస్తే.. డెలీవరీ చూసి షాక్‌ అయిన వ్యక్తి

28 Aug, 2022 17:08 IST|Sakshi

చెన్నై: ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే స్వయంగా వెళ్లి కొని తెచ్చుకునే వాళ్లం. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది.  ఫుడ్‌ నుంచి గ్రాసరీస్‌, మెడిసిన్‌, ఎలక్ట్రానిక్స్‌, హోం నీడ్స్‌ ఇలా ప్రతిదీ.. ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే క్షణాల్లో మన ముందు వాలుతోంది. అయితే అప్పుడు ఆర్డర్‌లు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్‌ అవ్వడం లేదా మనం చెప్పినా వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం వంటి పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది.

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 27) రాత్రి ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఆర్డర్‌ డెలివరీ అయ్యాకి.. పార్శిల్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతున్నాడు. ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు కండోమ్‌లు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. 
చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు!

ఇక జరిగిన పొరపాటుపై స్విగ్గీ సంస్థ స్పందించింది. తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పి, డబ్బును తిరిగి ఇచ్చింది. అయితే ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇలాంటి వస్తువులు డెలివరీ చేయడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి కండోమ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు