T20 World Cup 2021: ‘‘ఆమె డీఎన్‌ఏ తేడా.. భారత్‌ ఓడిపోతే.. టపాసులు కాల్చింది’’

26 Oct, 2021 16:22 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై వివాదాస్పద వ్యాఖ్యలు

చండీగఢ్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ ఓటమి తర్వాత దేశంలో రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. టీమిండియా ఓటమితో బాధలో ఉన్న క్రీడాభిమానులు మన రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు చూసి.. తలలు పట్టుకుంటున్నారు.

టీమిండియా ఓటమి అనంతరం పలువురు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వారి జాబితాలోకి హరియాణా హెల్త్‌ మినిస్టర్‌ అనిల్‌ వీజ్‌ చేరారు. పాకిస్తాన్‌ విజయంపై స్పందించిన అనిల్‌ విజ్‌.. జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డీఎన్‌ఏలోనే ఏదో లోపం ఉందన్నారు. ముఫ్తీలో భారతీయత ఏ మేరకు ఉందో నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. సోమవారం మెహబూబా ముఫ్తీ చేసిన ట్వీట్‌ని ఉద్దేశించి అనిల్‌ విజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
(చదవండి: టీమిండియాతో మ్యాచ్‌: పాక్‌ మినిస్టర్‌ సంచలన వ్యాఖ్యలు)

‘‘టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ సాధించిన గెలుపును కొందరు కశ్మీరీలు సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు మిఠాయిలు పంచుకున్నారు కొందరు. వారు గుర్తులేరా’’ అంటూ ముఫ్తీ ట్వీట్‌ చేశారు. దీనిపై అనిల్‌ విజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
(చదవండి: Ind Vs Pak: భారత్‌ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి )

‘‘మెహబూబా ముఫ్తీ డీఎన్‌ఏలోనే ఏదో తేడా ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆమె మాత్రమే కాదు పాకిస్తాన్‌ విజయం సాధించిన సందర్భంగా కొందరు టపాసులు కాల్చారు. వారి డీఎన్‌ఏ కూడా తేడానే. మన చుట్టూ దాక్కున్న దేశ ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ అనిల్‌ విజ్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి: Mohammad Shami: పాక్‌ అభిమానికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!
 

మరిన్ని వార్తలు