Tamilnadu: 112 మంది వైద్యులకు షాక్‌.. ఒక్కొక్కరికి రూ.50 లక్షల జరిమానా 

28 Aug, 2021 14:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, చెన్నై : ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు నిరాకరించిన 112 మంది వైద్యులు ఒక్కొక్కరు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని వైద్య విద్యశాఖ నోటీసులు జారీచేసింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మూడేళ్ల ప్రత్యేక వైద్య విద్యను పూర్తి చేసే డాక్టర్లు విధిగా రెండేళ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని లిఖితపూర్వక హామీ తీసుకుంటారు.

2020–2021లో ప్రత్యేక వైద్య విద్యను అభ్యసించిన వారిలో 112 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు ముందుకు రాలేదు. వారి నుంచి తలా రూ.50 లక్షల జరిమానా వసూలు చేయాలని వైద్య విద్యశాఖ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. వారిచ్చే సంజాయిషీని బట్టి తదుపరి చర్యలుంటాయని ప్రిన్సిపాళ్లు తెలిపారు.    

చదవండి: ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం

మరిన్ని వార్తలు