దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే!

11 Oct, 2022 20:06 IST|Sakshi

సాక్షి, చెన్నై: దీపావళి రోజున కేవలం 2 గంటల మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో అనే వివరాలను అందులో వెల్లడించారు.

ఈ మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే, భారీ శబ్దంతో కూడిన బాణసంచా ఉపయోగించవద్దని, గ్రీన్‌ టపాసులనే పేల్చాలని సూచించారు.  

మరిన్ని వార్తలు