Tamil Nadu Lockdown: సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం.. వారంలో ఆ రోజు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

5 Jan, 2022 18:21 IST|Sakshi

చెన్నై: థర్డ్‌వేవ్‌ విస్తృతం అవుతోన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో జనవరి 6 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఆదివారం రోజున మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని బస్సులు, రైళ్లు, మెట్రోలు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించే పొంగల్‌ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలు మూసివేయనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్‌ కేసులు 121కి చేరుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే 2,731 కరోనా కేసులు నమోదయ్యాయి.

చదవండి: (ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్‌ ప్రభుత్వం) 

మరిన్ని వార్తలు