డీఎంకే కూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల కేటాయింపు

7 Mar, 2021 12:37 IST|Sakshi
ఎంకే స్టాలిన్ ట్వీట చేసిన ఫొటో(ఫైల్‌)‌

సాక్షి, చెన్నై : డీఎంకే కూటమిలో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దు బాటు విషయంలో కాంగ్రెస్‌, డీఎంకే మధ్య ఒప్పందం కుదిరింది. డీఎంకే 180 స్థానాల్లో.. కాంగ్రెస్‌ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికలలోనూ కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. కాగా, గడిచిన అసెంబ్లీలో కేటాయించినట్లుగా ఈసారి కూడా 41 సీట్లకు కాంగ్రెస్‌ పట్టుబట్టడం, డీఎంకే కాదు పొమ్మని ఖరాఖండిగా చెప్పడంతో నిన్నటి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. కోరినన్ని సీట్లు కేటాయించకపోగా చర్చల సమయంలో తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని కాంగ్రెస్‌ అధ్యక్షులు కేఎస్‌ అళగిరి కన్నీళ్లు పెట్టుకోవడం ఆ పార్టీ నేతలను కలచివేసింది.

ఒకనొక దశలో కనీసం 30 సీట్లు ఇవ్వకుంటే డీఎంకేతో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలను రాహుల్‌గాంధీకి వివరించి ఆయన సలహామేరకు కూటమిలో కొనసాగడంపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆశావహులతో ముఖాముఖి ముగిసిన తరువాత ఆదివారం మరోసారి డీఎంకేతో చర్చలకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో 25 సీట్లకు కాంగ్రెస్‌ అంగీకారం తెలిపింది.

చదవండి : బీజేపీ బీ–టీం నేను కాదు.. ఆ పార్టీనే: కమల్

మరిన్ని వార్తలు