దేశాలు దాటిన ప్రేమ.. తల్లిదండ్రుల అనుమతితో రాష్ట్రానికి రప్పించి..

9 Sep, 2022 08:28 IST|Sakshi
విదేశీ యువతిని వివాహమాడిన కాళిదాసు

సాక్షి, చెన్నై: ఆన్‌లైన్‌లో ప్రేమించిన విదేశీ యువతిని రామేశ్వరం ఆలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన కాళిదాసు (30). ఇతని తండ్రి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి విశ్రాంతి పొందారు. విదేశాల్లో పని చేస్తూ వచ్చిన కాళిదాసు కరోనా కారణంగా సొంత ఊరికి వచ్చాడు.

గత రెండేళ్లుగా ఇంటి నుంచి అన్‌లైన్‌లో పని చేస్తూ వచ్చిన అతనికి యూరప్‌కి చెందిన హానా బొమిక్‌లోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఆన్‌లైన్‌లోనే ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకోవడానికి కాళిదాసు ఇష్టపడ్డాడు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ప్రియురాలిని రాష్ట్రానికి రప్పించాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వారి వివాహము రామేశ్వరంలోని భద్రకాళి అమ్మన్‌ ఆలయంలో బుధవారం ఘనంగా జరిగింది. తర్వాత వధూవరులు రామనాథస్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 

చదవండి: (తమిళనాడు అబ్బాయి, దక్షిణ కొరియా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!) 

మరిన్ని వార్తలు