ఇళ్లకే మద్యం పంపిణీ అయ్యేలా గ్రీన్‌ సిగ్నల్‌..పెళ్లిళ్లలో కూడా తాగొచ్చు..

24 Apr, 2023 12:32 IST|Sakshi

సాధారణంగా మద్యం విక్రయించాలంటే లైసెన్స్‌ ఉండాల్సిందే. ఇప్పటి వరకు క్లబ్‌లు, స్టార్‌ హోటల్స్‌కి మాత్రమే మద్యం వినియోగం కోసం లైసెన్స్‌ ఇచ్చేవారు. ఇక ఇళ్లలోని ఫంక్షన్స్‌ ఉత్సవాలు, స్టేడియం నుంచి జాతీయ, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల వరకు అన్ని చోట్ల మద్యం సర్వ్‌ చేయాలన్న లేదా కలిగి ఉండాలన్న లైసెన్స్‌ ఉండాల్సిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్‌.ఎల్‌.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ని కూడా ఎక్సైజ్‌ శాఖ గత నెలలోనే జారీ చేసింది.  మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది తమిళనాడు ప్రభుత్వం. అందులో భాగంగానే మద్య అమ్మకాలు పెంచేలా ఈ ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకువచ్చింది. దీంతో పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు స్టాలిన్‌ ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రత్యేక లైసెన్స్‌ వివరాలు..

  • దీన్ని డిప్యూటీ కమిషనర్‌ లేదా అసిస్టెంట్‌ కమిషనర్‌(ఎక్సైజ్‌) జారీ చేస్తారు.
  • ఇది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. 
  • ఈ లైసెన్స్‌ అతిథులు, సందర్శకుల తోపాటు అంతజర్జాతీయ లేదా జాతీయ ఈవెంట్‌లలో పాల్గొనేవారికి సర్వ్‌ చేసేందుకు, కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. 
  • దీని ఈవెంట్‌ తేదీ ఏడు రోజుల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి 
  • ఆయా ప్రదేశాల్లో మద్యం విక్రయించాలంటే ఈ ప్రత్యేక లైసెన్సు ఉండాలి. అందుకోసం ప్రభుత్వాన్నికి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • వాణిజ్యపరమైన ఈవెంట్లకు ప్రత్యేక లైసెన్స్‌ వార్షిక రుసుము కింద మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో రూ. లక్ష, మున్సిపాలటీల్లో రూ. 75వేలు, ఇతర ప్రదేశాల్లో రూ. 50,000 వరకు ఉంటుంది. అదే ఒక్కరోజు ఈవెంట్‌ నిర్వహణకు అయితే మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో రూ. 11 వేలు, మున్సిపాలటీల్లో రూ. 7500, ఇతర ప్రదేశాల్లో రూ. 5వేలు వరకు ఉంటుంది. ఇక గృహ వేడుకల సమయంలో నాన్-కమర్షియల్‌గా ఒక్కరోజుకి ఈ ప్రత్యేక లైసెన్స్‌ను రూ. 11,000 (మునిసిపల్ కార్పొరేషన్‌లలో), రూ. 7,500 (మున్సిపాలిటీలలో)  రూ.5 వేలు(ఇతర ప్రదేశాల్లో).

(చదవండి: ఆరోగ్య మంత్రి వీడియో చాట్‌ దుమారం.. బీజేపీ రాజీనామా డిమాండ్‌)

మరిన్ని వార్తలు