నేత్ర దానానికి పిలిపునిచ్చిన తమిళ సీఎం

8 Sep, 2020 15:43 IST|Sakshi

చెన్నై: అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి. నేత్ర దానం చేయడంలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నానంటూ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన కళ్లను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్‌ సందర్భంగా పళనిస్వామి తన కళ్లను దానం చేశారు. ఈ క్రమంలో కె పళనిస్వామికి తమిళనాడు రాష్ట్ర అంధత్వ నియంత్రణ సంఘం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యక్రమ అధికారి ఎస్.వి.చంద్రకుమార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చారు. (చదవండి: వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్‌! )

దానిలో ‘ఎడప్పాడి కె. పళనిస్వామి గర్వించదగిన కంటి దాత. ఆయన తన కళ్లని దానం ఇవ్వడం ద్వారా దేశాన్ని అంధత్వ రహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు’ అని సర్టిఫికెట్‌లో ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 మధ్య నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్‌నైట్ పాటిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మరణం తరువాత ఒకరి కంటి చూపును ఇతరులకు దానం చేయడం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు