MK Stalin Hospitalised: కరోనాతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

14 Jul, 2022 15:10 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన అడ్మిట్‌ అయ్యారు. 

కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, కాస్త అలసట, జ్వరంతో బాధపడుతున్నట్లు బులిటెన్‌లో తెలిపాయి ఆస్పత్రి వర్గాలు.

69 ఏళ్ల వయసున్న ఎంకే స్టాలిన్‌.. కొవిడ్‌-19 నిర్ధారణ కావడంతో మంగళవారం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు ట్విటర్‌ ద్వారా ఆయన సైతం ప్రకటించారు.

తమిళనాడు గత కొంతరోజులుగా.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌, సబ్‌ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. అయితే ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే నమోదు అవుతున్నాయని, త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు