క్రీడల శాఖ మంత్రిగా స్టాలిన్‌ వారసుడు ప్రమాణం

14 Dec, 2022 10:27 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్‌లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. 

సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్‌-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్‌ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్‌ వింగ్‌ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు.

ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్‌ గేమ్‌!.. నటుడు శరత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు