హ్యాకింగ్‌కు గురైన తమిళనాడు సీఎం ట్విటర్‌ అకౌంట్‌..!

10 May, 2021 11:30 IST|Sakshi

సాక్షి, చెనై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌  అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్య మాజీ సీఎం ఈపీఎస్‌ పళనిస్వామి ట్విటర్‌ అకౌంట్‌ను స్టాలిన్‌కు బదిలీ చేయడంలో ఈ సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా ద్యారా అధికారిక సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారు. అంతకుముందు ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి అధికార ట్విటర్‌ ఖాతాను ట్విటర్‌లో  మాజీ సీఎం ఇపీఎస్ పళనిస్వామి కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, తిరిగి తమిళనాడు సీఎం అధికార ఖాతాగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నాడీఎంకే ఐటీ వింగ్‌ తెలిపింది. 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో కూడా ఇదే లోపం నెలకొంది. తమిళనాడు సీఎం అధికార ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా పళనిస్వామి ఛాయాచిత్రం, పేరు, ఇతర వివరాలతోనే ఉంది.డీఎంకే ఐటీ విభాగం కార్యాలయ అధికారి మాట్లాడుతూ ..‘రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ట్విట్టర్ వచ్చిన తరువాత తమిళనాడులో ప్రభుత్వం మారడం ఇదే మొదటిసార’ ని అన్నారు. "ముఖ్యమంత్రి అధికార ట్విట్టర్ ఖాతాను బదిలీ చేయడంలో మాజీ సీఎం ఈపీఎస్‌కు  తప్పు సలహా ఇచ్చారని బీజేపీ నాయకుడు ఎస్జీ సూర్య ట్విటర్‌లో ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి ట్విటర్‌ ఖాతాను అప్పగించడం, గత సీఎం చేసిన  ట్వీట్లను ఆర్కైవ్ చేయడం సరైన పద్ధతని తెలిపారు.

చదవండి: M K Stalin: తమిళనాడు సీఎం బహిరంగ లేఖ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు