నటి వాణిశ్రీని పెద్ద సమస్య నుంచి గట్టెక్కించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

29 Sep, 2022 12:36 IST|Sakshi

చెన్నై: నటి వాణిశ్రీకి  త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్  అండ‌గా నిలిచారు. ఓ పెద్ద స‌మ‌స్య నుంచి ఆమెను గ‌ట్టెక్కించారు. నటి వాణిశ్రీకి చెందిన స్థ‌లాన్ని కొందరు  క‌బ్జా చేశారు. ఆ స్థ‌లం విలువ దాదాపుగా రూ.20 కోట్లు. ఈ  విష‌యాన్ని తెలుసుకున్న సీఎం ఎం.కె.స్టాలిన్, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.. వాణిశ్రీ భూమిని క‌బ్జా కోర‌ల్లో నుంచి విడిపించారు.
చదవండి: బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!

సదరు భూమి ప‌త్రాల‌ను వాణిశ్రీకి స్టాలిన్ అప్ప‌గించారు . ఇదే సంద‌ర్భంలో న‌కిలీ ప‌త్రాలు, వ్య‌క్తుల ద్వారా రిజిస్ట్రేష‌న్ చేస్తే దాన్ని ర‌ద్దు చేసే అధికారాన్ని క‌లిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు.

మరిన్ని వార్తలు