పట్టాలపై నిలబడి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. చివరికి!

4 Nov, 2022 08:36 IST|Sakshi

సాక్షి, చెన్నై: మద్యం మత్తులో ఓ యువకుడు రైలు పట్టాలపై నిలబడి రైలును అడ్డగించాడు. ఈ విషయం గుర్తించిన లొకోపైలెట్‌ రైలును ఆపి వేశాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి చెన్నైకి వస్తున్న లాల్‌బాగ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం ఉదయం యథావిధిగా బెంగుళూరు నుంచి బయలు దేరింది. రైలు ఉదయం 10.45 గంటల సమయంలో తిరుపత్తూరు జిల్లా వాని యంబాడి రైల్యేస్టేషన్‌లో నిలిచేందుకు తక్కువ వేగంతో వస్తుంది. రైలు న్యూటౌన్‌ రైల్యే గేటు వద్దకు రాగానే సుమారు 35 ఏళ్ల వ్యక్తి రైలు పట్టాలపై నిలబడి ఉన్నాడు.

వీటిని గమనించిన రైలు ఇంజిన్‌ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి, రైలు ను నిలిపి వేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రైలు పట్టాలపైకి వెళ్లి, యువకుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యు వకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.   
 

మరిన్ని వార్తలు