మాజీ జవాన్‌ నిర్వాకం.. మద్యంమత్తులో కలెక్టరేట్‌కి వచ్చి..!

10 May, 2022 06:51 IST|Sakshi
మాజీ జవానును ప్రశ్నిస్తున్న పోలీసులు

వేలూరు: వేలూరు కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవాన్ని కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మాజీ ఆర్మీ జవాన్‌ తన భార్యతో కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్‌ వద్దకు వెళ్లి.. మద్యం మత్తులో సెల్‌ఫోన్‌ను చూస్తూ నిలుచున్నాడు.

ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్‌ మాజీ జవాన్‌ను కోరగా అందుకు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. గమనించిన జిల్లా అధికారులు వెంటనే పోలీసులను రప్పించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో అతను కింద పడి పోయాడు. అనంతరం పోలీసులు విచారణ జరపగా అతను వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన మాజీ జవాన్‌ వేల్‌మురుగన్‌ తేలింది. ఇతని కుటుంబ ఆస్తి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు చేసేది లేక అతన్ని కారులో ఇంటికి పంపించి వేశారు.    

మరిన్ని వార్తలు