Tamil Nadu: మా వల్ల కాదు బాబోయ్‌.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం!

5 Sep, 2021 10:02 IST|Sakshi
ఎన్నికల సంఘం కార్యాలయం

మరో ఆరునెలలు గడువు కోరుతూ సుప్రీంలో ఎస్‌ఈసీ పిటిషన్‌

స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా..? 

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మళ్లీ జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు నెలలు గడువు కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది.  

నేపథ్యం ఇదీ.. 
రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరునల్వేలి, తెన్‌కాశి, వేలూరు, రాణి పేట, తిరుపత్తూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని జిల్లా, యూనియన్, పట్టణ, గ్రామ పంచాయతీల అధ్యక్షులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన జిల్లాల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 కార్పొరేషన్లు, 120 మేరకు మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. కొత్త జిల్లాల్లోని స్థానిక సంస్థలు, రాష్ట్రంలోని  నగర, మునిసిపాలిటీలకు సెపె్టంబరు 15లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ

ఇందుకు తగ్గ పనులు రాష్ట్రంలో శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన ముగించి, ఓటర్ల జాబితా ప్రకటించారు. అలాగే,  ఈనెల 6న కోయంబేడులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సమావేశానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో సెపె్టంబరు 15లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఈ మేరకు మరో ఆరు నెలలు గడువు కోరుతు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

‘కొత్త’ తలనొప్పి.. 
ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్రంలో  6 మేజర్‌ మునిసిపాలిటీల ను కార్పొరేషన్లుగాను, 30 మేజర్‌ పట్టణ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా కలి్పస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో కార్పొరేషన్ల సంఖ్య 21గాను, మునిసిపాలిటీల సంఖ్య అదనంగాను పెరిగింది. దీంతో ఆయా సంస్థల్లో వార్డుల విభజనతో పాటుగా ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదవండి: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్‌.. 5 నిముషాల సమయం

ఈ సమయంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 15లోపు ఎన్నికలు నిర్వహించలేమంటూ ఎస్‌ఈసీ పిటిషన్‌లో పేర్కొంది. ఇది సోమవారం విచార ణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయాలపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రు మీడియాతో మాట్లాడు తూ ఎన్నికల నిర్వహణలో జాప్యం అనివార్యం అని.. అన్ని సమస్యలను సకాలంలో పరిష్కరిస్తే డిసెంబర్‌ నాటికి ఈ ప్రక్రియను ముగించే అవకాశం ఉందన్నారు.  

మరిన్ని వార్తలు