పైశాచిక చర్య.. గజరాజు బలి

23 Jan, 2021 09:13 IST|Sakshi

ఏనుగును భయపెట్టేందుకు కాలుతున్న టైరు విసిరిన వ్యక్తి 

ఉదకమండలం: ఓ రిసార్టు యజమాని పైశాచిక చర్య ఓ ఏనుగు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా మసినగుడి వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నీలగిరి అడవుల్లో సంచరించే 50 ఏళ్ల గజరాజు సమీపంలోని మసినగుడి వద్ద ఉన్న ఓ ప్రైవేట్‌ రిసార్టు ప్రాంగణంలోకి ప్రవేశించింది. దానిని భయపెట్టి, పారదోలేందుకు ఆ రిసార్టు నిర్వాహకులు కాలుతున్న టైరును ఏనుగు పైకి విసిరేశారు.

మండుతున్న ఆ టైరు ఏనుగు చెవి చుట్టూ ఇరుక్కుపోయింది. తీవ్రంగా కాలుతుండటంతో ఏనుగు బాధతో ఘీంకరిస్తూ తీవ్ర రక్త స్రావం కారణంగా సమీపంలోని రిజర్వాయర్‌ వద్ద పడిపోయింది. అటవీ సిబ్బంది గమనించిన చికిత్సకు తరలించే లోగానే కన్నుమూసింది. అటవీశాఖ అధికారులు రిసార్టు యజమాని రేమండ్, సహాయకుడు ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. సమీపలోని భవనం పైనుంచి ఏనుగుపైకి మండుతున్న టైరును విసిరి వేస్తున్న ఫొటోలు వారి సెల్‌ఫోన్లలో లభ్యమయ్యాయి. ఈ ఫుటేజీని శుక్రవారం అటవీ శాఖ విడుదల చేసింది.
(చదవండి: ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి)

మరిన్ని వార్తలు