లాక్‌డౌన్ : త‌మిళ‌నాడు కీల‌క నిర్ణ‌యం

30 Jul, 2020 16:04 IST|Sakshi

చెన్నై: క‌రోనా కేసులు రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో తమిళనాడు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వివిధ ఆంక్ష‌ల‌తో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా  ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ర్టంలో శుక్ర‌వారంతో లాక్‌డౌన్ గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో  వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర భేటి అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  (భారతీయ కంపెనీలపై ఆరోగ్య మంత్రి ప్రశంసలు)

రాష్ర్టంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను క‌ఠినత‌రం చేశారు. పార్కులు, బీచ్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుందని వెల్ల‌డించారు. అంతేకాకుండా అంతర్రాష్ట రవాణాపై నిషేధం కొనసాగనుందని సీఎం స్ప‌ష్టం చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వ‌చ్చేవారికి ఈ-పాస్ లేనిదే అనుమ‌తించమ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. త‌మిళ‌నాడులో ఇప్ప‌టివ‌ర‌కు 2,27,688 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా ప్ర‌స్తుతం 57వేల యాక్టివ్ కేసులున్నాయి. (తొలిసారి ఒక్కరోజులో కొత్తగా 50 వేలకు పైగా కేసులు)


 

మరిన్ని వార్తలు