Viral Video: భీకర గంగా ప్రవాహం.. క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్‌, అయితే..

27 Oct, 2021 12:19 IST|Sakshi

తమిళనాడు అటవీ అధికారులు ఓ మహిళను ఆమె కూతురిని రక్షించిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. రెండు నిమిషాల నిడివిగల ఆ వీడియోలో ఓ మహిళ తన ఒడిలో చిన్నారిని పట్టుకొని జలపాతం పక్కన ఉన్న కొండ వద్ద చిక్కుకుపోగా ఆమెను అటవీ అధికారులు రక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా అత్తూరు సమీపంలోని కల్లవరయన్‌ కొండల్లో అనైవారి మట్టల్‌ జలపాతం కొండల మీద నుంచి పరవళ్లు తొక్కుతోంది.
చదవండి: 150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం.. నెట్టింట ఫోటో వైరల్‌

ఈ క్రమంలో ప్రమాదకరంగా ఉన్న రాయిపై మహిళ తన కూతురితో చిక్కుకుపోయింది. వరద ప్రవాహంతో ఎక్కువగా ఉండడంతో ఆమె ఎటూ వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ రెస్క్యూ అధికారులు కొంతమంది యువకులు తాడు సాయంతో తల్లీబిడ్డలను రక్షించారు. అయితే అటవీశాఖ అధికారులకు సహాయం అందిస్తున్న సమయంలో చివరలో ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారు. అప్పటికే వీడియో పూర్తయినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు నదికి అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు.
చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు