TN Governor Ravi: నీట్‌పై రగడ.. రాష్ట్రపతికి బిల్లు పంపిన గవర్నర్‌

5 May, 2022 11:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులో నీట్‌(National Entrance-cum-Eligibility Test or NEET)పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో నీట్‌ పరీక్షకు బదులుగా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్‌ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఆమోదించాలని గురువారం తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. 

మరోవైపు.. ‘‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్.. కేంద్ర హోంశాఖకు పంపారు. కానీ, రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరిస్తారు’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అన్నారు. కాగా, నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలంలోని తన ఇంట్లో 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టింది. 

ఇది కూడా చదవండి: రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంటే కళ్లు మూసుకోం.. తమిళనాడు గవర్నర్‌ తీరు, కేంద్రంపై ఆగ్రహం

>
మరిన్ని వార్తలు