భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే?

20 May, 2022 09:13 IST|Sakshi
అలగు, పట్టుబడిన కొండ చిలువ

తిరువొత్తియూరు(చెన్నై): భార్యను కొరికిన కొండచిలువను భర్త ప్రాణంతో పట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంఘటన పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది. వివరాలు.. జిల్లాలోని తిరుమయం సమీపంలోని మేల దూర్వాసపురానికి చెందిన పాండియన్‌ (37) భార్య అలగు (33) బుధవారం తన ఇంటి సమీపంలో ఉన్న కట్టెలను పేరుస్తుండగా ఓ పాము ఆమెను కాటు వేసింది.

దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త పాండియన్‌కు తెలిపింది. అతను ఆ పామును పట్టుకుని గోనె సంచిలో వేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి తన భార్యకు చికిత్స చేయమని కోరాడు. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువ కాటు వల్ల అలగుకు ప్రమాదం ఉండదని తెలిపారు. అనంతరం కొండచిలువను అడవిలో వదిలిపెట్టారు.

చదవండి: Karnataka Heavy Rains: ఇదేందయ్యా.. నెల వర్షం ఒక్క రోజులోనే!

మరిన్ని వార్తలు