ఆంధ్రప్రదేశ్‌ తరహాలో ఇంటి వద్దకే రేషన్‌

9 Jul, 2021 03:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడు మంత్రి చక్రపాణి

మా సీఎంతో చర్చించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తాం

తిరువళ్లూరు (తమిళనాడు): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ విధానాన్ని తమిళనాడులో అమలు చేసే అంశంపై త్వరలో తమ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చక్రపాణి తెలిపారు. ఆయన గురువారం మంత్రి నాసర్, కలెక్టర్‌ అల్బీజాన్‌ వర్గీష్‌తో కలిసి తిరువళ్లూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పంపిణీ, వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు.

అనంతరం మంత్రి చక్రపాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల వద్దే రేషన్‌ వస్తువులు అందజేస్తోందన్నారు. తిరువళ్లూరు ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి కొందరు రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో భద్రపరిచి విక్రయిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.  

మరిన్ని వార్తలు