కాబోయే సీఎం స్టాలినే.. నేను గ్యారంటీ

28 Mar, 2021 21:29 IST|Sakshi
మాట్లాడుతున్న రాహుల్‌ గాంధీ

చెన్నై : ఈ సారి తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలినేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జోష్యం చెప్పారు. అందుకు తాను గ్యారంటీ అని అన్నారు. ఆదివారం సేలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓట్లరను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘ నేను గ్యారంటీ ఇస్తున్నాను. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి స్టాలినే. ఓ నిర్ణయం అయితే జరిగిపోయింది. ఎన్నికల్లో తేలాల్సి ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల వద్ద లెక్కలేనంత డబ్బు ఉంది. వాళ్లను అడ్డుకోవాలి. ముందు తమిళనాడులోనుంచి వాళ్లను బయటకు నెట్టాలి. తర్వాత ఢిల్లీ పీఠంనుంచి కూడా.  తమిళనాడు ఆలోచనలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోంది.

దాన్ని అంత తక్కువగా అంచనా వేయకూడదు. ఈ దాడి వెనుక పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. తమిళనాడు వ్యక్తి ఎవరూ కూడా అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌ కాళ్లను పట్టుకోవాలనుకోడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ముఖ్యమంత్రి ఎందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు అమిత్‌ షాకు లొంగిపోయారు. అవినీతి పరుడైన కారణంగానే ముఖ్యమంత్రి అమిత్‌ షాకు లొంగిపోయారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రజల డబ్బు దొంగిలించిన కారణంగా వలలో ఇరుక్కుపోయారు’’ అని అన్నారు.

చదవండి, చదివించండి : మీ మైండ్‌ గేమ్స్‌ ఇక్కడ పనిచేయవు : ఎంపీ

మరిన్ని వార్తలు