కస్టడిలో వ్యక్తి మృతి.. రాత్రి సమయంలో విచారణ చేయొద్దు..

4 May, 2022 16:11 IST|Sakshi

పోలీసులకు డీజీపీ ఆదేశాలు 

సాక్షి, చెన్నై: రాత్రి సమయాల్లో ఖైదీలను విచారణ చేయవద్దని.. పోలీసులకు రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటలలోపు వారిని జైలుకు తరలించాలని పేర్కొన్నారు. విఘ్నేష్(25)  అనే వ్యక్తి కస్టడీలో మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆ ఆదేశాలు వెలువడ్డాయి. కాగా గత కొన్ని రోజులకు ముందు చెన్నై కెల్లిస్‌ కూడలి వద్ద సందేహాస్పదంగా వస్తున్న ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అందులో గంజాయి, కత్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ఆటోలో వచ్చిన విఘ్నేష్, అతని స్నేహితుడిని పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు.

ఆ సమయంలో విగ్నేష్‌కు ఫిట్స్‌ వచ్చినట్లు అతని కీల్పాక్కమ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించడం జరిగింది. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో డీజీపీ శైలేంద్ర బాబు ఓ ప్రకటన జారీ చేశారు. అందులో ఖైదీలను రాత్రి సమయంలో విచారణ చేయవద్దని స్పష్టం చేశారు. 
చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్‌ లైంగిక దాడి

మరిన్ని వార్తలు