యాచకురాలికి ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుల్‌

18 Sep, 2022 17:48 IST|Sakshi
శిశువును పరిశీలిస్తున్న యువరాణి 

సాక్షి, చెన్నై: వేలూరు సౌత్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువరాణి శనివారం రాత్రి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ప్రముఖ వస్త్ర దుకాణం వద్ద 35 ఏళ్ల యాచకురాలు ప్రసవం నొప్పులతో ఇబ్బంది పడుతోంది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.అత్యవసర పరిస్థితిని గుర్తించిన యువరాణి మరో పీసీతో కలిసి ఆమెకు ప్రసవం చేసింది.

ఆడ శిశువు జన్మించింది. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందజేసి వేలూరు పెంట్‌ల్యాండ్‌ ఆసుపత్రికి తల్లీ, బిడ్డను తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు  తెలిపారు. ఆమె వద్ద విచారణ జరపగా భర్త వదిలి వెళ్లి పోవడంతో దిక్కులేక భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. మహిళా పోలీసులు ఆమెకు దుస్తులు, వస్తువులను అందజేశారు. పీసీ యువరాణిని అధికారులు ప్రశంసించారు. కాగా  నవజాత శిశువును పట్టుకుని ఉన్న పోలీసు ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం

మరిన్ని వార్తలు