లైవ్‌లో మదనుడి బూతులు, రాసలీలల స్క్రీన్ షాట్స్‌

14 Jun, 2021 14:34 IST|Sakshi

చెన్నై: పబ్‌జీ.. మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్‌. బ్యాన్‌ విధించినప్పటికీ వీపీఎన్‌ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అలాంటి గేమ్‌లో మదన్‌ ఘనాపాటి. తమిళనాడుకు చెందిన మదన్‌ ఓపీ.. గేమర్‌, వ్లోగర్‌ కూడా. యూత్‌లో ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్‌ ఉంది. అంతెందుకు కొందరు సెలబ్రిటీలు కూడా ఇతని అభిమానులే. అలాంటి కుర్రాడిపై లైంగిక ఆరోపణల కింద కేసు బుక్‌ అయ్యింది. 

అసలు మదన్‌కి ఇంతలా పేరు రావడానికి ముఖ్య కారణం.. పబ్‌జీ గేమింగ్‌లో అతను ఉపయోగించే భాష. కో-ప్లేయర్స్‌ గనుక బాగా ఆడకపోతే బండబూతులు తిడతాడు. లైవ్‌లో ఉన్నాననే సంగతి మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ ఆటిట్యూడ్‌ అతనికి మరింత క్రేజ్‌ తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆటలో అతను ఇచ్చే టిప్స్‌.. ఇంటర్నేషనల్‌ వైడ్‌గా అతనికి గుర్తింపు ఇచ్చింది. అయితే రీసెంట్‌గా ఓ వీడియోలో అతను అమ్మాయిలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలం వాడాడు. దీంతో ఇతగాడి వ్యవహారం చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు చేరింది. 

శృతి మించారు
నిజానికి ఈ కుర్రాడు పబ్లిక్‌కి తెలిసేలా తప్పులన్నీ చేస్తుంటాడు. అతనికి ఉన్న అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగోలా వాళ్ల అమ్మాయిల నెంబర్లు సంపాదించి.. వాళ్లతో మాటలు కలుపుతాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. తేడాగా వ్యవహరిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో న్యూడ్‌గా వీడియో ఛాట్‌ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఛాటింగ్‌లను, స్క్రీన్ షాట్లను పబ్లిక్‌గానే పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ వ్యవహారంలో బాధిత యువతులనూ ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బహిరంగంగానే చేస్తున్నానని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన మీద కుట్రపన్నారని మదన్‌ చెప్తున్నాడు.  

చర్యలు తప్పవా?
ఇక తాజాగా విమర్శల నేపథ్యంలో మదన్‌ దూకుడు తగ్గించాడు. తన సోషల్‌ మీడియా అకౌంట్లకు కామెంట్‌ సెక్షన్‌కు ప్రైవసీ పెట్టాడు. అతని యూట్యూబ్‌ పేజీలో 8 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. వాళ్లలో చాలామంది 18 ఏళ్లలోపు వాళ్లే. అందుకే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ గరం అయ్యింది. కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు సోషల్‌ మీడియాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో కేసు చెన్నై పోలీసులు కేసు రిజిస్ట్రర్‌ చేయడంతో.. త్వరలోనే మదన్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారంతా. ఇది #arrestmadanop పేరుతో ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌ కథ.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు