శ్రీలంక బాలికకు అరుదైన శస్త్ర చికిత్స

9 Jun, 2022 07:46 IST|Sakshi
శస్త్రచికిత్సకు ముందు.. తర్వాత

సాక్షి, చెన్నై: శ్రీలంకకు చెందిన 12 ఏళ్ల బాలికకు చెన్నై క్రోమ్‌ పేటలోని మల్టీ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్‌ రేలా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. బుధవారం ఈ చికిత్స గురించి ఆర్టోపెడిక్స్‌ హెడ్‌ పార్థసారథి శ్రీనివాసన్‌ మీడియాకు వివరించారు. శ్రీలంకకు చెందిన సాన్వి(12) మూడేళ్లుగా విపరీతమైన వెన్ను నొప్పితో బాధ పడుతూ వచ్చింది. దీంతో చెన్నై రేలాకు తీసుకొచ్చారు. స్కోలియోసిస్‌ బారిన ఆ బాలిక పడ్డట్లు గుర్తించారు.

ఈ కారణంగా వెన్నెముక 140 డిగ్రీల వంపుతో ఎస్‌ ఆకారానికి చేరింది. ఆమె బరువు 30 కేజీలు మాత్రమే ఉండటం రక్తం పరిమాణం  2.5 లీటర్లు ఉండడంతో నిపుణులతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఎస్‌ ఆకారం నుంచి వెన్నెముక నిటారుగా యథాస్థితికి చేర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో బాలిక ఇకపై ఎత్తు పెరగడమే కాకుండా, తల భాగాన్ని పైకి కిందికి కదిలించే అవకాశం లభించిందన్నారు.

చదవండి: సిద్ధూ హత్య కేసు: మాస్టర్‌ మైండ్‌ అతనేనన్న ఢిల్లీ పోలీసులు

మరిన్ని వార్తలు