మా పార్టీ తరపున సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు: తమిళనాడు ఎంపీ

6 Oct, 2022 08:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి రావడం గొప్ప పరిణామని ప్రముఖ దళిత నేత, ఎంపీ, ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ అధినేత తిరుమావళన్‌ వ్యాఖ్యానించారు.

మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే కేసీఆర్‌ ప్రత్యేకతలు కలిగి ఉన్న నాయకుడని అన్నారు. దేశ ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ అవసరం ఉందన్నారు. వీసీకే పార్టీ తరపున కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే, అంతకుముందు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కర్ణాటకలో బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయస్థాయిలో ప్రభావం చూపాలని ఆకాంక్షించారు. 

చదవండి: (KCR Party: బీఆర్‌ఎస్‌పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు