Tamil Nadu: తెలుగు మీడియంలో చేరిన విద్యార్థులకు..

30 May, 2022 15:42 IST|Sakshi

పళ్లిపట్టు(చెన్నై):  ప్రభుత్వ పాఠశాలలో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంపొందించే లక్ష్యంతో అత్తిమాంజేరి తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. పళ్లిపట్టు మండలం అత్తిమాంజేరి ప్రభుత్వ ప్రాథమిక తెలుగు పాఠశాలలో 15 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా భూపతి, సహాయ ఉపాధ్యాయులుగా మునెమ్మ, మాధవన్‌ విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యపట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు మోజు పెరగడంతో పాటు నిర్భంద తమిళ విద్యా విధానం తెలుగు పాఠశాలలకు శాపంగా మారింది.

అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయా లు మెరుపడడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. ఈ నేపథ్యంలో జూన్‌ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించారు. హెచ్‌ఎం భూపతి సహాయ ఉపాధ్యాయులు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చేరే విద్యార్థుల కుటుంబాలకు రూ.వెయ్యి విలువైన టేబుల్‌ ఫ్యాన్‌ను అందిస్తున్నారు. దీంతో తొలిరోజు నలుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. వీరికి సర్పంచ్‌ ఝాన్సీ ప్రకాష్‌ బహుమతి ప్రదానం చేశారు. గతంలో తెలుగు మీడియంలో విద్యార్థులను చేర్చే ఆశయంతో అడ్మిషన్‌ పొందే ప్రతి విద్యార్థికి గ్రాము బంగారం ఉచితంగా ప్రధానోపాధ్యాయు డు భూపతి పంపిణీ చేయడం విశేషం.

చదవండి: AP Crime: ఇలా చేశావేంటి అలెగ్జాండర్‌.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..

మరిన్ని వార్తలు