ఏ మాత్రం జాలి, దయ లేకుండా..

18 Aug, 2020 15:23 IST|Sakshi

చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు ఓ రోగిని వీల్‌ చైర్‌లోంచి కిందపడేసిన సంఘటనపై తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)‌ స్పందించింది. ఈ మేరకు సోమవారం వైద్య, గ్రామీణ ఆరోగ్య సేవల డైరెక్టర్‌కు నోటీసు పంపింది. కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్-పేషెంట్ వార్డులో ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఓ పేషెంట్‌.. హాస్పిటల్ ఉద్యోగి బాస్కరన్‌(40)ను, తన మంచం మీదకు వెళ్లడానికి సహాయం చేయమని కోరతాడు. కానీ బాస్కరన్‌ స్పందించడు. పేషెంట్‌ పదే పదే ప్రాధేయపడటంతో సదరు ఉద్యోగిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటిది. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ పేషెంట్‌ను వీల్‌ చైర్‌లో నుంచి కిందకు పడేస్తాడు. పాపం ఆ వ్యక్తి మంచం మీదకు ఎక్కడానికి నానా అవస్థలు పడతాడు. అంతేకాక బాస్కరన్‌ అతడిని తిట్టడం వీడియలో చూడవచ్చు. ఈ తతంగాన్ని మరో పేషెంట్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సదరు ఉద్యోగితో పాటు ఆస్పత్రి యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. (5 రూపాయల డాక్టర్‌ ఇకలేరు)

అంతేకాక దీని గురించి ఓ తమిళపత్రికలో వార్తా కథనం ప్రచురితమయ్యింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించి.. నోటిసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆలస్యం చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా