‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ కీలక వ్యాఖ్యలు

9 Jan, 2023 07:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో సిబ్బంది సరిగా స్పందించలేదని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ ఘటన వ్యక్తిగతంగా నాకు, ఎయిరిండియా సిబ్బందికి మనస్తాపం కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాల్సిన, స్పందించాల్సిన తీరును సమీక్షించి, సరిచేస్తాం’’ అన్నారు.  

నిందితుడి అరెస్ట్‌..
ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్‌ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్‌ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ అనామిక పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Shocking: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ

మరిన్ని వార్తలు