లోయలోకి దూసుకెళ్లిన కారు‌.. 8 మంది దుర్మరణం

16 Nov, 2022 22:42 IST|Sakshi

జమ్మూ: జమ్ముకశ్మీర్‌లో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టవార్‌ జిల్లాలో ఓ క్యాబ్‌ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

ఈ ప్రమాదంపై కిష్టవార్‌ డీసీపీ దేవాన్స్‌ యాదవ్‌ మాట్లాడుతూ..  ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మృతదేహాలను వెలికి తీశామని..  సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.  ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: గోఖలే వంతెన త్వరలో కూల్చివేత 

మరిన్ని వార్తలు