విషాదం: కరోనా రాకూడదని ముక్కులోకి నిమ్మరసం..

29 Apr, 2021 13:06 IST|Sakshi

ముక్కులోకి నిమ్మరసం..

ఉపాధ్యాయుడు దుర్మరణం 

సాక్షి, రాయచూరు: కరోనా ముందుజాగ్రత్తగా ముక్కులోకి నిమ్మరసం పిండుకొన్న ఓ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన బుధవారం జిల్లాలో చోటు చేసుకుంది. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం బయటపడి కరోనా బారిన పడకుండా ఉండవచ్చనే ఆశతో సింధనూరులోని శరణ బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బసవరాజ్‌(43) నిమ్మరసం పిండుకోగా, అస్వస్థతకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా, ఇద్దరు యువకులు మృతి 
రాయచూరు రూరల్‌: ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాలూకాలో చోటు చేసుకుంది. గిల్లేసూగూరు నుంచి చిక్కమంచాలకు వరిగడ్డిని తీసుకురావడానికి వెళుతున్న సమయంలో అదుపు తప్పి ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడడంతో శ్యామ్యూల్‌(28), శాంతరాజ్‌(21)లు మరణించినట్లు డీఎస్పీ శివనగౌడ పాటిల్‌ తెలిపారు. ఈ ఘటనపై ఇడపనూరు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చదవండి: నిలుస్తున్న ప్రాణాలు..భిల్వారా మోడల్‌ అంటే ఏమిటి? 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు