క్లాస్‌ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి.. పేరెంట్స్‌ అరెస్టు

22 Mar, 2023 15:58 IST|Sakshi

టీచర్‌ని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా క్లాస్‌ రూమ్‌ చుట్టూ పరిగెత్తించి మరీ చితకబాదారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తమిళనాడుతో స్కూల్‌లో టీచర్‌పై రెండో తరగతి విద్యార్థి పేరెంట్స్‌ దారుణంగా దాడి చేశారు. విద్యార్థి తల్లిందండ్రలు నేరుగా ఉపాధ్యాయుడి క్లాస్‌ రూం వద్దకు వచ్చి మరీ గొడవకు దిగారు. మా పిల్లలను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?..అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ టీచర్‌ని క్లాస్‌లోనే విద్యార్థులందరి ముందు పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టారు.

ఆఖరికి సమీపంలోని ఇటుక రాయిని కూడా తీసుకుని ఆయన మీదకు విసిరే యత్నం చేశారు. అందుకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు బాధిత ఉపాధ్యాయుడుని ఆర్‌ భరత్‌గా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఆచిన్నారి తాతయ్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక దాడికి పాల్పడినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ విషయమై దర్యాప్తు  ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో..సదరు విద్యార్థి క్లాస్‌లో సరిగా వినకపోవడం, ఇతర పిల్లలను కొట్టడం వంటివి చేయడంతో టీచర్‌ ఆమెను సీటు మారమని చెప్పారు. ఐతే సీటు మారుతున్న క్రమంలో ఆ చిన్నారి పడిపోయింది. కానీ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తనను టీచర్‌ కొట్టాడంటూ.. వాళ్ల తాతయ్యకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మా పిల్లలనే కొడతావ అంటూ టీచర్‌పైకి దాడికి దిగారని పోలీసులు తెలిపారు.

(చదవండి: ట్రీట్‌మెంట్‌కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు