క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో టీచర్‌ మాస్‌ డ్యాన్స్‌.. సోషల్‌ మీడియాలో సూపర్‌ ట్విస్ట్‌! 

2 Dec, 2022 18:18 IST|Sakshi

ఇటీవలి కాలంలో క్లాస్‌ రూమ్స్‌లో విద్యార్థులతో పాటు టీచర్లు డ్యాన్స్‌ చేయడం చాలా వీడియోల్లో చూశాము. తాజాగా ఓ మహిళా టీచర్‌ కూడా క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ టీచర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను విధుల నుంచి తొలగించాలని కామెంట్స్‌ చే​స్తున్నారు. 

వివరాల ప్రకారం.. ఈ వీడియోలో భోజ్‌పురి సాంగ్ ప‌త్లి క‌మ‌రియ మోరికు ఏకంగా క్లాస్‌రూంలోనే టీచ‌ర్ డ్యాన్స్ చేస్తుండ‌టం క‌నిపించింది. ఆపై టీచ‌ర్‌తో పాటు పిల్ల‌లు కూడా కెమెరా వైపు చూస్తూ ఆనందంలో ఎంతో హ్యాపీగా డ్యాన్స్‌ చేస్తుంటారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారుల‌కు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచ‌ర్ వారి ఎదుట సినిమా పాట‌కు ఆడిపాడటం ఏంటని కొందరు ప్రశ్నించారు. గురువుల‌పై ఉన్న గౌర‌వాన్ని కోల్పోయేలా చేయ‌వ‌ద్ద‌ని మ‌రో యూజ‌ర్ హిత‌వు ప‌లికారు. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ వీడియో రికార్డు చేయ‌డం కరెక్ట్‌ కాదంటూ మరో నెటిజన్‌ ఫైరయ్యారు. టీచ‌ర్‌పై త‌క్ష‌ణ‌మే వేటు వేయాల‌ని కొంద‌రు యూజ‌ర్లు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు