బుద్ధి మారని ఉపాధ్యాయుడు.. వాట్సాప్‌లో హనీమూన్‌ గురించి విద్యార్థినితో..

9 Dec, 2022 09:30 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బుద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తరచూ విద్యార్థినుల వద్ద అశ్లీలంగా ప్రవర్తించడం అతనికి అలవాటుగా మారింది. ఉన్నత పాఠశాల విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఇంటి ముఖం పట్టాడు. ఈ ఘటన కోలారు తాలూకాలోని నరసాపురం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.  

హనీమూన్‌ గురించి చర్చ  
విద్యార్థిని మొబైల్‌కు అశ్లీల మెసేజ్‌లు పంపాడని ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్దకు వచ్చి కన్నడ ఉపాధ్యాయుడు సిఎం ప్రకాష్‌ను నిలదీశారు. బీఈఓ ఎదుట ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. వాట్సాప్‌లో హనీమూన్‌ గురించి తమ కూతురితో చర్చలు చేశాడని వారు ఆరోపించారు. ఈ ఉపాధ్యాయుడు 2010లో కూడా ఇదే పాఠశాలలో ఒక  విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండు అయ్యాడు. అప్పుడు అక్కడి బదిలీ అయ్యి తిరిగి ఇదే పాఠశాలకు తిరిగి వచ్చాడు. తాజా సంఘటన నేపథ్యంల ఈ టీచర్‌ను బీఈఓ కన్నయ్య సస్పెండు చేశారు.      

చదవండి: (వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య)

మరిన్ని వార్తలు