సీఎం మీటింగ్‌లో ప్లేట్స్‌ కోసం కొట్టుకున్నంత పని చేశారు.. వీడియో వైరల్‌

12 May, 2022 14:38 IST|Sakshi

పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఫ్రీ లంచ్‌ కార్యక్రమంలో ప్లేట్స్‌ కోసం ప్రిన్స్‌పాల్స్‌, టీచర్లు కొట్టుకున్నంత పనిచేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. పంజాబ్‌లో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం భగవంత్‌ మాన్‌ ఓ రిసార్ట్‌లో ప్రిన్స్‌పాల్స్‌, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మీటింగ్‌ సందర్భంగా సీఎం మాన్‌.. ఉపాధ్యాయుల సూచనలు, ఐడియాలను షేర్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. విద్యార్ధులకు మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని వారిని సీఎం కోరారు. 

ఇదిలా ఉండగా.. సీఎం మీటింగ్‌ ముగిసిన అనంతరం లంచ్‌ కోసం ఉపాధ్యాయులంతా వెళ్లారు. ఆ సమయంలో పేట్స్‌ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనికి  సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, ఈ మీటింగ్‌ కోసం విద్యాశాఖ మంత్రి గుర్మీత్‌సింగ్.. ఉపాధ్యాయులను ఏసీ బస్సుల్లో రీసార్ట్‌కు తరలించడం విశేషం. 

ఇది కూడా చదవండి: నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

మరిన్ని వార్తలు